వర్షంలో ఇలా అస్సలు చెయ్యకండి

వర్షం పడేటప్పుడు తప్పనిసరిగా రెయిన్‌కోట్ లేదా గొడుగు వాడాలి.

వరద నీటిలో నడవకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఆ నీటి వల్ల వ్యాధులు రాగలవు.

వర్షపు నీరు ఇంట్లోకి రాకుండా.. డోర్లు, కిటికీలూ మూసివెయ్యాలి.

నీరు నిలిచిపోకుండా ఇంటి చుట్టూ డ్రైనేజ్ సరిగా ఉండేలా చూసుకోవాలి.

పాదాలకు ఇన్ఫెక్షన్లు రాకుండా.. వాటర్‌ప్రూఫ్ ఫుట్‌వేర్ వాడాలి.

తాజా ఆహారం మాత్రమే తినాలి. తద్వారా ఫుడ్ పాయిజన్ అవ్వదు.

వాటర్ స్టోరేజ్ కంటైనర్లను మూసివెయ్యాలి. లేదంటే దోమలు గుడ్లు పెడతాయి.

జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యాలి. వరదలు ఉన్న రోడ్లవైపు వెళ్లకూడదు.

అత్యవసర మందులు, ఫస్ట్ ఎయిడ్ కిట్ దగ్గర ఉంచుకోవాలి.

ఎలక్ట్రిక్ వైర్లు నీటిలో పడకుండా వాటిని దూరంగా ఉంచాలి.

పిడుగులు పడే సమయంలో లోహ వస్తువులు, కరెంటు పోల్స్ ముట్టుకోవద్దు.

వాతావరణ రిపోర్టులు తెలుసుకుంటూ, ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండాలి.