పాలు, బెల్లంతో ఆరోగ్యం

పిల్లల నుంచి ముసలివారి వరకూ అందరూ పాలను తాగుతారు. 

ఈ పాల వల్ల ఎముకలకు కాల్షియం లభిస్తుంది. మలబద్ధకం సమస్య తీరుతుంది.

పాలకు బెల్లం కూడా మిక్స్ చేస్తే, మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

పాలు, బెల్లం రెండూ కలిపి తాగితే, జీర్ణక్రియ మరింత మెరుగవుతుంది.

పాలు, బెల్లంలో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి.

రోజూ బెల్లం కలిపిన పాలను తాగితే, నిద్ర బాగా పడుతుంది.

రోజూ రాత్రివేళ పడుకునే ముందు బెల్లం కలిపిన గోరువెచ్చని పాలు తాగొచ్చు.

బెల్లం మన శరీరంలో వేడిని క్రమబద్ధం చేస్తుంది. జ్వరం రాకుండా కాపాడుతుంది.

చలికాలంలో వేడి పాలలో బెల్లం కలుపుకొని తాగడం ఎంతో మేలు.

కొంతమంది టీలో బెల్లం కలుపుకొని తాగుతారు. అలా కూడా ప్రయోజనాలు ఉంటాయి.

మీ పర్సనల్ డాక్టర్ సలహాలతో రోజూ ఎన్ని పాలు తాగాలో నిర్ణయం తీసుకోండి.