వీరు పొరపాటున కూడా నిమ్మరసం తీసుకోకూడదు!

ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే నిమ్మరసం తీసుకోవద్దు. 

నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

నిమ్మ నీరు జీర్ణ ప్రక్రియను మెరుగుపరచడంతో పాటు బరువు తగ్గడంలోనూ సాయపడుతుంది. 

అయితే నిమ్మరసాన్ని పరిమితంగానే తీసుకోవాలి. అలాగే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నిమ్మరసానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 

దంతాల సమస్యలతో బాధపడేవారు నిమ్మరసాన్ని ఎక్కువ నీటిలో కలుపుకొని తాగాలి. 

మరీ తక్కువ నీటిలో లేదా నిమ్మరసాన్ని నేరుగా తీసుకున్నా.. దంతాలు మరింత దెబ్బతిని సమస్య ఎక్కువయ్యే అవకాశం ఉంది. 

కొందరికి నిమ్మకాయ వంటి సిట్రస్ పండ్లను తింటే దురద, దద్దుర్లు వస్తాయి. 

పెదవులు, నాలుకపై, గొంతులో వాపు వస్తుంది. అలాంటి వారు నిమ్మరసానికి దూరంగా ఉండాలి. 

కొన్నిరకాల ఆరోగ్య సమస్యలకు ముందులు వాడేవారు నిమ్మరసం తాగితే వాటి ప్రభావం సరిగా పనిచేయదు. 

నిమ్మకాయ కాలేయ ఎంజైములను ప్రభావితం చేయడం వల్ల ఆ మందులు సరిగా జీర్ణం కావు. దీనిపై డాక్టరు సలహా తీసుకోండి. 

పొట్టలో యాసిడ్ రియాక్షన్స్ జరిగినప్పుడు, అల్సర్ సమస్య ఉన్నప్పుడు నిమ్మరసం నేరుగా తీసుకున్నా, తక్కువ నీటిలో కలుపుకొని తాగినా సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.