అంజలా జవేరి భర్త తెలుగు నటుడు అని మీకు తెలుసా..?

అంజలా జవేరి.. ఈ బ్యూటీ గురించి ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం లేదు కానీ.. 90లో టాలీవుడ్‌లో ఈ బ్యూటీ సృష్టించిన యుఫోరియా అంతా ఇంతా కాదు.

నిజానికి ఈ హీరోయిన్ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ప్రేమించుకుందా..రా సినిమా. 

అంతేకాదు టాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి అంజలా జవేరి ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమాతోనే.

తొలి సినిమాతోనే టాలీవుడ్‌లో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకుంది. 

అసలు ఈ సినిమాలో అంజలా జవేరి క్యూట్ యాక్టింగ్‌కు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు. 

ఆ తర్వాత చూడాలని ఉంది, సమరసింహా రెడ్డి, రావోయ్ చందమామ, దేవి పుత్రుడు.. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో యమ బిజీగా గడిపింది.

ఇక చివరగా ఈ బ్యూటీ శేఖర్ కమ్ములా దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో కనిపించింది. 

ఇక ఇదిలా ఉంటే ఈ బ్యూటీ హస్బెండ్ టాలీవుడ్‌లో క్రేజీ విలన్ అన్న విషయం మీకు తెలుసా..? 

ఆయన పేరు తరుణ్ ఆరోరా. 'ఖైదీ నెం.150'లో అగర్వాల్‌గా నటించిన విలన్ ఆయనే. 

పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు', 'జయజానకి నాయక', 'అమర్ అక్బర్ ఆంటోని'.. ఇలా చాలా తెలుగు సినిమాల్లో నటించాడు.

గతేడాది రిలీజైన భోళా శంకర్ సినిమాలో కూడా ఆయన విలన్ రోల్ ప్లే చేశాడు.