భారీగా పెరిగిన వంట నూనె ధరలు.. కొత్త రేట్లు ఇవే

కుకింగ్ ఆయిల్ ధరలు పెరిగాయి.

రూ.15 నుంచి రూ.25 వరకు పెరిగాయి.

పామాయిల్, పొద్దుతిరుగుడు నూనె ధరలు పైపైకి చేరాయి.

విదేశీ దిగుమతులపై దిగుమతి సుంకం పెంపు కారణం.

పొద్దుతిరుగుడు నూనె 15 కిలోల డబ్బా ఖరీదు శుక్రవారం రూ.1,730 ఉంది.

శనివారం తెల్లారేసరికి రూ.2 వేలకు చేరింది.

కిలో ప్యాకెట్‌ ధర రూ.108 నుంచి రూ.125కు ఎగబాకింది.

పామాయిల్‌ 15 కిలోల డబ్బా రూ.1,530 ఉండేది.

ఇప్పుడు రూ.1,730కు చేరింది.కిలో రూ.95 శనివారం నుంచి రూ.110 చేరింది.