iPhone 13పై భారీ తగ్గింపు... ఏకంగా రూ.18,900 ఆఫర్..!

ఆపిల్ ఫోన్.. చాలా మందికి ఈ ఫోన్‌ను లైఫ్‌లో ఒక్కసారైనా కొని వాడాలని అనుకుంటారు. 

కానీ.. ఈ ఫోన్‌ను కొనాలంటే కిడ్నీని అమ్ముకోవాలి అని సరదాగా అనుకుంటుంటారు.

అంటే.. దీని ధర ఆ రేంజ్‌లో ఉంటుందని అని వెనకడుగు వేస్తుంటారు. ఇప్పుడంటే ఈఎమ్‌ఐ ఆఫ్షన్ ఉండటంతో చాలా మంది కొంటున్నారు.

ఒక నాలుగైదేళ్ల కిందట.. ఈ ఫోన్ కొనాలంటే, మినిమం 40-50 వేల శాలరీ ఉండాల్సిందే.

నిజానికి చాలా మందికి ఇప్పటికీ ఐ ఫోన్ అంటే అందరాని ద్రాక్షలానే ఉంది.

కాగా ఐ ఫోన్ కొనాలని కలలు కనేవారికి ఓ క్రేజీ ఆఫర్ రాబోతుంది. 

అదేంటంటే.. రాబోయే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఐఫోన్ 13 భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 27న ప్రారంభం కానుంది. ప్రైమ్ మెంబర్‌ల కోసం ఇది సెప్టెంబర్ 26న షెడ్యూల్ చేశారు. 

రీసెంట్‌గా iPhone 16 విడుదలైన తర్వాత iPhone 13 ధరలను భారీగా తగ్గించారు. 

ప్రస్తుతం iPhone 13 అమెజాన్‌ వెబ్ సైట్లో 128GB వేరియంట్‌కు రూ.48,900కి అందుబాటులోకి వచ్చింది.

కాగా అమెజాన్‌లో బ్యాంక్ ఆఫర్‌లతో సహా రూ. 39,999కి iPhone 13ని సేల్‌ల కొనుగోలు చేయవచ్చు.

అంటే.. దాదాపుగా రూ.18,900 ఈ సేల్‌లో డిస్కౌంట్ వస్తుంది.