3 వారాలు తిరక్కుండానే ఓటీటీలోకి సరిపోదా శనివారం మూవీ..!

గత నెల 29న రిలీజైన సరిపోదా శనివారం సినిమాకు పాజిటీవ్ రివ్యూలు వచ్చాయి.

మరీ బ్లాక్ బస్టర్, తోపు సినిమా అనే రేంజ్‌లో టాక్ రాలేదు కానీ.. ఓ సారి హ్యాపీగా చూసేయోచ్చు అనే టాక్ మాత్రం తెచ్చుకుంది.

కొంత కత్తెరకు పని చెప్పుంటే మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేదని చాలా మంది అభిప్రాయ పడ్డారు. 

ఒక్క రన్ టైమ్ విషయంలో తప్ప సినిమాలో చెప్పుకోవడానికి పెద్దగా తప్పులేం కనిపించలేదు.

ఇక నాని, SJ సూర్యల టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్‌కు అసలు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు. 

ఏమన్న యాక్టింగ్ చేసిర్రా అసలు. కొన్ని సీన్లలో గూస్‌బంప్స్ తెప్పించారు. 

అసలు వివేక్ ఆత్రేయా లాంటి క్లాస్ డైరెక్టర్ ఇలాంటి మాస్ అవుట్‌ పుట్‌తో వస్తాడని ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయరు.

తొలిరోజే పాతిక కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా… రీసెంట్‌గా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టించింది.

ఇక ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయినట్లు తెలుస్తుంది.

సెప్టెంబర్ 26 నుంచి ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం.

ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. అంతేకాకుండా రూ.45 కోట్లకు ఓటీటీ హక్కులు అమ్ముడుపోయినట్లు సమాచారం.