ఈ రాయి ధరిస్తే, భవిష్యత్తును ఊహిస్తారు
ఇది టాంజనైట్ (Tanzanite) రాయి. చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది.
దీన్ని ఉంగరంలో రాయిలా లేదా మెడలో లాకెట్ లాగా ధరించవచ్చు.
దీన్ని ధరించిన వారికి కొన్ని ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు.
ఈ రాయి ఆధ్యాత్మిక వికాసాన్నీ, అవగాహననూ పెంచుతుంది. శాంతి, మానసిక ప్రశాంతతను పొందుతారు.
క్రియేటివిటీ పెంచుతుంది. ఏదైనా చెప్పాలనుకున్నది బాగా చెప్పగలుగుతారు.
అంతర్యామి శక్తి బలపడి.. జరగబోయేది ముందే ఊహించగలుగుతారు.
భావోద్వేగాలను కంట్రోల్ చేసుకుంటూ.. ఆత్మపరిశీలన చేసుకోగలుగుతారు.
వ్యక్తిగత మార్పులు రాగలవు, వ్యక్తి అభివృద్ధిని ఈ రాయి ప్రోత్సహిస్తుంది.
సంభాషణల్లో, నిజం మాట్లాడే ధైర్యాన్ని పెంచుతుంది. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.
ఈ రాయి ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. దివ్య శక్తితో సంబంధాన్ని పెంచుతుంది.
ఈ సమాచారం జ్యోతిష నిపుణులది మాత్రమే. తెలుగు న్యూస్18 దీన్ని నిర్ధారించట్లేదు.
More
Stories
చింతపండుతో ఎన్ని లాభాలో!
13వ రాశి ఉండేదని తెలుసా?
సాయంత్రం వాస్తు