వెస్టిండీస్ తో రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆరంభమైంది.
వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో ఆడని రవిచంద్రన్ అశ్విన్ తొలి రోజు అదరగొట్టాడు.
5 వికెట్లతో మెరిశాడు.
ఈ క్రమంలో ఒకే రోజు మూడు రికార్డులను అందుకున్నాడు.
విండీస్ యువ ఓపెనర్, శివనారాయణ్ చంద్రపాల్ తనయుడు తగెనారాయణ్ చంద్రపాల్ వికెట్ తీయడం ద్వారా అరుదైన మైల్ స్టోన్ ను అశ్విన్ సాధించాడు.
అంతర్జాతీయ క్రికెట్ లో తండ్రిని, తనయుడిని అవుట్ చేసిన తొలి భారత బౌలర్ గా అశ్విన్ రికార్డులకు ఎక్కాడు.
దాంతో పాటు బౌల్డ్ ల రూపంలో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన భారత బౌలర్ గా అశ్విన్ నిలిచాడు.
95 వికెట్లతో అనిల్ కుంబ్లే (94 బౌల్డ్) రికార్డును అధిగమించాడు.
ఇక అంతర్జాతీయ క్రికెట్ లో 700 వికెట్లు తీసిన మూడో భారత బౌలర్ గా నిలిచాడు.
ఈ జాబితాలో అనిల్ కుంబ్లే (956 వికెట్లు).. హర్భజన్ సింగ్ (709 వికెట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.