విండీస్ పర్యటనను టీమిండియా ఘనంగా ఆరంభించింది.
తొలి టెస్టులో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో నెగ్గింది.
రెండో ఇన్నింగ్స్ లోనూ అశ్విన్ 7 వికెట్లతో మెరిశాడు.
తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లను కలుపుకుని ఈ టెస్టులో అశ్విన్ 12 వికెట్లు సాధించాడు.
ఈ క్రమంలో అశ్విన్ పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు.
ఇండియా, విండీస్ జట్ల మధ్య జరిగిన సిరీస్ ల్లో అత్యధిక ‘ఫైవ్ వికెట్స్ హాల్ (6 సార్లు)’ తీసిన బౌలర్ గా నిలిచాడు.
ఒక టెస్టు మ్యాచ్ లో 12 వికెట్లు తీయడం అశ్విన్ కు ఇది 6వసారి. శ్రీలంక దిగ్గజం మురధీరన్ మాత్రమే ఈ ఘనతను సాధించాడు.
విండీస్ వేదికగా టెస్టుల్లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ (12/156) నమోదు
టెస్టుల్లో 10 వికెట్ల హాల్ ను కంప్లీట్ చేయడం ఇది అశ్విన్ కు 8వ సారి. కుంబ్లే కూడా 8 సార్లు ఈ ఘనత సాధించాడు.
భారత్ తరఫున అత్యధిక అంతర్జాతీయ వికెట్లు తీసిన రెండో బౌలర్ గా అశ్విన్. కుంబ్లే (953), అశ్విన్ (709)