మొదటినెల గర్భమా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

గర్భం దాల్చిన మొదటి నెల తల్లి ఏ ఆహారం తీసుకోవాలో, ఏ వ్యాయామాలు చెయ్యాలో తెలుసుకుందాం.

యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్టులో పింక్ లైన్ కనిపిస్తే, డాక్టర్ దగ్గరకు వెళ్తారు. డాక్టర్ టెస్ట్ చేసి, కన్ఫామ్ చేస్తారు.

డాక్టర్ అల్ట్రాసౌండ్ టెస్ట్ చేసి, డెలివరీ ఎప్పుడు జరగవచ్చో చెబుతారు.

స్కాన్ టెస్ట్ ద్వారా ప్రెగ్నెన్సీ మొదటి నెలా కాదా అన్నది తెలుస్తుంది.

మొదటి 3 నెలలూ వికారం, వాంతులు కామన్. రిలీఫ్ కోసం డాక్టర్ మందులు ఇస్తారు.

ప్రోటీన్ ఉండే ఆహారం తీసుకోవాలి. మొలకలు తినాలి. వీటిలోని ఫ్యా్ట్స్, కార్బోహైడ్రేట్స్ మేలు చేస్తాయి.

డాక్టర్ ఫోలిక్ యాసిడ్ (folic acid) టాబ్లె్ట్స్, మల్టీ విటమిన్ టాబ్లెట్స్ ఇస్తారు. వీటిని తప్పక వాడాలి.

ఆహారం తినేటప్పుడు కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకోవాలి. అర్థరాత్రి తినకూడదు.

పండ్లు, ఆకుకూరలు, పాలు, నట్స్, పెరుగు, పనీర్ వంటివి తినవచ్చు. టీ, కాఫీలు ఎక్కువ వద్దు.

ఎక్సర్‌సైజ్ అత్యవసరం. రోజూ 30 నుంచి 35 నిమిషాలు నడవాలి. రోజూ రాత్రి వేళ 8 గంటలు పడుకోవాలి.

టైట్ డ్రెస్సులు వాడొద్దు. మీకు కంఫర్ట్‌గా ఉండే డ్రెస్సులు వాడాలి. పని మధ్యలో బ్రేక్ ఇచ్చుకోవాలి. 

Disclaimer: ఇది సాధారణ సమాచారం. ఇది అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు.