రూ.2,400 తగ్గింపు.. ఫోన్ రీచార్జ్ చేసుకుంటే భారీ డిస్కౌంట్

వొడాఫోన్ ఐడియా మొబైల్ ఫోన్ యూజర్లకు కళ్లుచెదిరే ఆఫర్ తెచ్చింది.

వీఐ స్మార్ట్‌ఫోన్ ప్రోగ్రామ్‌ తీసుకువచ్చింది.

మొబైల్ రీచార్జ్‌పై ఏకంగా రూ. 2,400 డిస్కౌంట్ పొందొచ్చు.

ఈ తగ్గింపు ఒకేసారి ఉండదు. 2 ఏళ్లు ప్రతి నెలా డిస్కౌంట్ వస్తుంది.

ప్రతి నెలా రీచార్జ్‌పై రూ.100 డిస్కౌంట్ వస్తుంది.

ఇలా 24 నెలల కాలంలో రూ. 2,400 ఆదా అవుతాయి.

వీఐ యాప్ ద్వారా హీరో అన్‌లిమిటెడ్ ప్లాన్స్ ద్వారా ఈ ప్రయోజనం పొందొచ్చు.

కొత్త ఫోన్‌లో వీఐ సిమ్ కార్డు వేసుకుంటే ఆఫర్ వర్తిస్తుంది.

అర్హత కలిగిన కస్టమర్లకు డిస్కౌంట్ రీచార్జ్ ఆఫర్ తెలుస్తుంది.