TS Jobs: గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు..
జులై 19 నుంచి దరఖాస్తులను స్వీకరించనుండగా.. జులై 24 చివరి తేదీగా పేర్కొన్నారు.
ఆయా కాలేజీల్లో ఖాళీలను దృష్టిలో ఉంచుకొని 1652 గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రిక్రూట్మెంట్ ఎలా చేసుకోవాలన్న దానిపై జిల్లా ఇంటర్ విద్య అధికారులకు మార్గదర్శకాలను సూచించింది.
జిల్లా కలెక్టర్ చైర్మన్గా జాయింట్ కలెక్టర్, కాలేజీ ప్రిన్సిపల్ మెంబర్లుగా కమిటీ ఉంది.
ఈ ముగ్గురు గెస్ట్ ఫ్యాకల్టీని ఎంపిక చేస్తారు.
జిల్లా ఇంటర్ విద్య అధికారుల కార్యాలయాల్లో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.
వచ్చిన దరఖాస్తుల్లో పీజీ మార్కుల ఆధారంగా 1:3 పద్ధతిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పిలుస్తారు.
జిల్లా ఇంటర్ విద్యాధికారి ఎంపిక చేసి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సెలక్షన్ కమిటీకి మెరిట్ లిస్టును పంపిస్తారు.
కలెక్టర్ ఆధ్వర్యంలో సెలక్షన్ కమిటీ గెస్ట్ ఫ్యాకల్టీనీ ఎంపిక చేస్తారు.