UGC NET Results: యూజీసీ నెట్ ఫలితాలు..

యూజీసీ- నెట్‌ పరీక్ష ఫలితాలకు సంబంధించి కీలక అప్‌డేట్‌ వచ్చింది. 

ఈ పరీక్ష ఫలితాలను వచ్చే వారంలో విడుదల చేయనున్నట్టు యూజీసీ ఛైర్మన్‌ వెల్లడించారు.

జులై 26 లేదా 27 నాటికి ఫలితాలను వెల్లడించడమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లక్ష్యంగా పెట్టుకుందని ట్విటర్‌లో తెలిపారు. 

ఇందులో ఏమైనా మార్పులు ఉంటే తాను అప్‌డేట్‌ ఇస్తానని పేర్కొన్నారు.

జూన్‌ 13 నుంచి జూన్‌ 22వరకు ఆన్‌లైన్ విధానంలో UGC NET పరీక్షను నిర్వహించి సంగతి తెలిసిందే. 

మొత్తం 83 సబ్జెక్టులకు దేశవ్యాప్తంగా 181 నగరాల్లోని పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 6,39,069 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 

దేశంలోని యూనివర్సిటీల్లో లెక్చరర్‌షిప్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ పరీక్షను NTA ఏటా రెండు సార్లు నిర్వహిస్తోంది.

వివరాలకు అభ్యర్థులు https://ugcnet.nta.nic.in/ సందర్శించండి.