సచిన్ రికార్డుకు కోహ్లీ గురి

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ మరో రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్దం అయ్యాడు.

ఇప్పటికే అనేక రికార్డులు బద్దలు కొట్టిన అతడు తాజాగా క్రికెట్ దేవుడు సచిన్ రికార్డుపై కన్నేశాడు.

వన్డేల్లో అత్యంత వేగంగా 13 వేల పరుగులు చేసిన బ్యాటర్ గా సచిన్ టెండూల్కర్ ఉన్నాడు.

321 ఇన్నింగ్స్ లో సచిన్ 13 వేల పరుగులను పూర్తి చేశాడు.

ప్రస్తుతం కోహ్లీ 278 ఇన్నింగ్స్ ల్లో 12,898 పరుగులు చేశాడు.

ఇందులో 46 సెంచరీలు.. 65 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

విండీస్ తో జరిగే సిరీస్ లో కోహ్లీ 13వేల పరుగుల మైలురాయిని చేరితే అత్యంత వేగంగా ఈ ఘనత అందుకున్న ప్లేయర్ అవుతాడు.

ఈ ఏడాది కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు.

ఇప్పటి వరకు 7 టెస్టుల్లో 557 పరుగులు చేశాడు.

9 వన్డేల్లో 427 పరుగులు చేశాడు. ఓవరాల్ గా ఈ ఏడాది 16 మ్యాచ్ ల్లో 984 పరుగులు చేశాడు.