అల్లు అర్జున్‌ సినిమాకు నో చెప్పిన శ్రీలీల..

రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ..

ఒకే సినిమాతో మంచి పాపులారిటీని తెచ్చుకుంది ఈ యంగ్ హీరోయిన్.. 

శ్రీలీల ఇటీవల రవితేజ సరసన ధమాకాలో నటించి మరో హిట్‌ను అందుకుంది. 

 తెలుగులో వరుస సినిమాలతో అదరగొడుతోన్న శ్రీలీలకు.. మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే తెలుగులో శ్రీలీల ఓ పది సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తోంది. 

కాగా ఈ భామకు అల్లు అర్జున్ సినిమాలో నటించే మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప2 అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. 

అయితే ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్‌లో నటించేందుకు శ్రీలీలను పుష్ప2 టీమ్ అడిగారట. 

 అయితే తనకు ఇప్పుడే ఐటెమ్ సాంగ్స్‌లో నటించాలని లేదని.. సున్నితంగా నో చెప్పిందట.