అల్లంతో ఇలా చేస్తే.. మృదువైన చేతులు మీ సొంతం

అల్లంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

మనం తినే వంటల్లో అల్లాన్ని వాడుతుంటాం.

అయితే అల్లంతో అందాన్ని పెంచుకోవచ్చు కూడా.

కాలం ఏదైనా మన చేతులు పగులుతూనే ఉంటాయి.

ఎటువంటి క్రీములు వాడకుండా అల్లంతో మన చేతులను మృదువుగా చేసుకోవచ్చు.

ఇందుకోసం 100 గ్రాముల అల్లాన్ని చెంచా కొబ్బరినూనె వేసిన నీటిలో మరిగించి ఈ నీటిని వడకట్టాలి.

నీటిలో నానబెట్టి మిక్సీలో వేసిన 3 లేదా 4 బాదం పప్పుల మిశ్రమాన్ని ఈ వడకట్టిన నీటిలో కలపాలి.

ఈ నీటికి ఒక చెంచా చెక్కర కలిపి.. అనంతరం ఆ నీటిని ముంజేతులకు స్క్రబ్ చేసి ఆరనివ్వాలి.

అనంతరం మీ చేతులను గోరు వెచ్చని నీటితో కడగండి. చర్మం మృదువుగా తయారవుతుంది.