నిలబడి నీళ్లు తాగరాదా?

మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు శరీరానికి అవసరమైనంత నీరు తాగాలి.

శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపడంలో నీరు ముఖ్య పాత్ర పోషిస్తుంది.

నీటిని సరైన మోతాదులో తీసుకోకుంటే డీ హెడ్రేషన్ బారిన పడే అవకాశం కూడా ఉంటుంది.

అందుకే వైద్యులు ప్రతి రోజు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీటిని తాగాలని సూచిస్తారు.

నీటిని తప్పుడు మార్గంలో తీసుకుంటే తీవ్ర హానీ కలిగే అవకాశం ఉంటుంది.

చాలా మంది నిలబడి నీళ్లు తాగుతారు. అలా చేయడం ఆరోగ్యానికి హానికరం.

నీటిని నిలబడి తీసుకుంటే.. నీరు నేరుగా అన్నవాహిక ద్వారా కడుపులోకి వెళ్తుంది. దీని కారణంగా అన్నవాహికపై ఒత్తడి పెరిగి జీర్ణ ప్రక్రియలో ఇబ్బందులు కలుగొచ్చు.

జీర్ణక్రియ సక్రమంగా జరగదు.

నిలబడి నీరు తాగడం వలన అన్నవాహిక, చిన్న పేగును కలిపే చోటు గాయం అయ్యే ప్రమాదం కూడా ఉంది.

అంతేకాకుండా నిలబడి నీళ్లు తాగితే దాహం పూర్తిగా తీరదు. అందుకే పెద్దలు ప్రశాంతంగా కూర్చొని నీటిని తాగమని చెబుతారు.

(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు.)