సిగ్నల్ దగ్గర జోమాటా డెలీవరీ బాయ్ ఏంచేశాడంటే..?

చాలా మంది ఫుడ్  కోసం జొమాటో, స్విగ్గీలలో ఆర్డర్ చేస్తుంటారు..

టీ , టిఫిన్, స్నాక్స్,లంచ్ ఇలా ఏం ఫుడ్ కావాలన్న ఆన్ లైన్ ఆర్డర్ చేస్తారు

కర్ణాటకలోని బెంగళూరులో షాకింగ్ ఘటన వెలుగులోనికి వచ్చింది. 

ఒక డెలీవరీ బాయ్ సిగ్నల్ వద్ద నిలబడి కస్టమర్ భోజనం తిన్నాడు. 

అతను డెలీవరీ చేయాల్సిన ఫుడ్ ఓపెన్ చేసి ఏంచక్కా తింటున్నాడు. 

వెనుక వైపు కారులో ఉన్న వ్యక్తి ఈ తతంగమంతా వీడియోతీశాడు.

ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

దీనిపై కొందరు నెటిజన్లు జోమాటో డెలీవరీ బాయ్ పై మండిపడుతున్నారు. 

ఇదేం బుద్ధిరా నాయన అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

మరికొందరు జొమాటో సంస్థ అతడిని జాబ్ నుంచి తీసేయాలని కోరుతున్నారు.