శివుడిని బిల్వదళాలతో అర్చిస్తే గొప్ప ఫలితాలు..

శివుని ఆరాధనలో బిల్వ పత్రాల అర్చనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. 

బిల్వపత్రం లేకుండా శివుని ఆరాధన అసంపూర్ణంగా భావిస్తారు..

 శ్రావణ మాసంలో శివుడిని, విష్ణువును విశేషంగా పూజించుకుంటారు. 

శివుడికి పాలు, తేనె, నెయ్యి, చక్కెర, పెరుగులతో కలిసి అభిషేకం చేస్తారు. 

అంతే కాకుండా అనేక రకాల ఫలాలతో కూడా అర్చిస్తారు

స్కాందపురాణం ప్రకారం, బిల్వపత్రంలో పార్వతి ఉంటుందని చెబుతారు..

పార్వతి మందరాచల్ పర్వతాన్ని ఒకసారి  సందర్శించిందంట...

అప్పుడు అమ్మవారి చెమట చుక్కలు పడి బిల్వపత్రంమొలిచిందంట..

అప్పటి నుంచి బిల్వపత్రమన్నా, పండు సమర్పింస్తుంటారు..

శ్రావణ మాసంలో ప్రత్యేకంగా శివయ్యకు మారేడు దళాలు సమర్పిస్తారు