ఏయ్ బిడ్డ..  ఇది కోహ్లీ అడ్డా

విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసి 15 ఏళ్లు పూర్తయ్యింది.

2008, ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా కోహ్లీ సీనియర్ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు.

నేటితో (ఆగస్టు 18, 2023) 15 ఏళ్ల కెరీర్ ను కోహ్లీ పూర్తి చేసుకున్నాడు.

ఈ క్రమంలో ఎన్నో రికార్డ్స్ ను సొంతం చేసుకున్నాడు.

వన్డేల్లో అత్యంత వేగంగా 7 వేలు, 8 వేలు, 9 వేలు, 10 వేలు, 11 వేలు, 12 వేలు పూర్తి చేసుకున్న ప్లేయర్ గా ఉన్నాడు.

వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డు (సచిన్ : 49)కు కేవలం 3 సెంచరీల దూరంలో కోహ్లీ ఉన్నాడు.

అంతేకాకుండా 100 సెంచరీల రికార్డుకు కూడా చేరువగా ఉన్నాడు. కోహ్లీ 76 సెంచరీలు చేయగా.. సచిన్ 100 సెంచరీలు బాదాడు.

అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు కోహ్లీ సొంతం. (115 మ్యాచ్ ల్లో 4,008 పరుగులు)

Fill in some text

ఐపీఎల్ లో అత్యధిక పరుగుల రికార్డు (7,263), అత్యధిక సెంచరీలు (7) రికార్డు కూడా కోహ్లీ సొంతం.