PG Counselling: కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల..  

పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ తేదీలు ఖరారయ్యాయి.

ఈ ప్రక్రియ సెప్టెంబరు 5 నుంచి జరగనుంది.

ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల పరిశీలన కోసం సెప్టెంబరు 5 నుంచి 15 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి.

సెప్టెంబరు 20 నుంచి 22 వరకు వెబ్‌ ఆప్షన్లు స్వీకరిస్తారు.

ఆప్షన్లను సవరించుకోవడానికి సెప్టెంబరు 23 అవకాశం ఇస్తారు.

సెప్టెంబరు 26న మొదటి విడత పీజీ సీట్లను కేటాయించనున్నట్టు కన్వీనర్‌ పాండురంగారావు తెలిపారు.

సెప్టెంబరు 29లోగా అభ్యర్థులు తమకు సీటు వచ్చిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుందన్నారు.

మిగిలిన సీట్ల భర్తీ కోసం అక్టోబరు 1 నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుంది.

8 యూనివర్సిటీల్లో ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం, ఎంఈడీ తదితర 66 పీజీ కోర్సుల్లో ప్రవేశాలను భర్తీ చేస్తారు.