Police Jobs: 7,547 కానిస్టేబుల్ ఉద్యోగాలు..
ఇంటర్ పాసై పోలీస్ ఉద్యోగంలో చేరాలనుకొనే వారికి గుడ్న్యూస్.
ఢిల్లీ పోలీసు విభాగంలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
మొత్తం 7,547 కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) ఉద్యోగాల భర్తీకి ఎస్ఎస్సీ ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
సెప్టెంబర్ 1 నుంచి 30వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
డిసెంబర్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
అర్హత 10+2 (సీనియర్ సెకండరీ) ఉత్తీర్ణతతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ (LMV) ఉండాలి.
జీతం నెలకు రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు ఫజు రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు మినహాయింపు ఇచ్చారు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష, పీఈటీ/ పీఎంటీ, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక ఉంటుంది.