Inter Students: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్..

తెలంగాణలో ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును సెప్టెంబర్‌ 16 వరకు పొడిగించారు.

రూ.1000 ఆలస్య రుసుముతో ఈనెల 16వరకు కాలేజీల్లో చేరవచ్చని ఇంటర్‌ బోర్డు తెలిపింది.

రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం వరకు ఇంటర్‌ ఫస్టియర్‌లో 4,92,873 మంది చేరారు.

రాష్ట్రంలోని 1285 ప్రైవేటు కాలేజీల్లో 3,11,160 మంది విద్యార్థులు చేరారు.

408 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 83,177 మంది చేరారు.

బైపీసీ అభ్యర్థులకు 2 నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానున్నాయి.

ఈ నెల 4, 5వ తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన, 4 నుంచి 7 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు.

రాష్ట్ర వ్యాప్తంగా బీఫార్మసీలో 114 కాలేజీల్లో 6,910 కన్వీనర్‌ కోటా సీట్లు ఉన్నాయి.

ఫార్మ్‌-డి కోర్సులో 61 కళాశాలల్లో 1,192 సీట్లు ఉన్నాయి.

బయోటెక్నాలజీలో 94, బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌లో 36, ఫార్మాస్యూటికల్‌ ఇంజినీరింగ్‌లో 81 కన్వీనర్‌ కోటా సీట్లు ఉన్నాయి.