TSPSC Exams: ఈ నెలంతా పరీక్షలే..

టీఎస్పీఎస్సీ నుంచి గత సంవత్సరం 27కు పైగా నోటిఫికేషన్లు విడుదల అయిన సంగతి తెలిసిందే.

వాటికి వరుసగా పరీక్షలను నిర్వహిస్తోంది టీఎస్పీఎస్సీ. 

సెప్టెంబర్‌ నెలలో జరగాల్సిన పోటీ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. 

 పాలిటెక్నిక్‌ కాలేజీల్లో లెక్చరర్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షలను ఈ నెల 4, 5, 6, 8వ తేదీల్లో టీఎస్‌పీఎస్సీ నిర్వహించనుంది.

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోని ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులకు సంబంధించి ఈ నెల 11వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. 

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల లెక్చరర్‌ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 12 నుంచి 29వ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్(JL) పోస్టలు ఈ నోటిఫికేషన్ ద్వారా 1392 పోస్టులను భర్తీ చేయనున్నారు.

మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. 

పేపర్ 1 లో 150 మార్కులు.. పేపర్ 2లో మొత్తం 300 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు.