గుడ్డు ఏ టైంలో తింటే మంచిది..?

ఆహారంతో ఆరోగ్యం ముడిపడి ఉంటుంది. 

అందుకే తీసుకునే ఆహార పదార్థాలపై ఎప్పుడూ శ్రద్ధ పెట్టాలి. 

విటమిన్లు, ఖనిజాల విషయానికి వస్తే గుడ్లు న్యూట్రిషినల్ జాక్‌పాట్ లాంటివి.

అయితే.. గుడ్లు ఎప్పుడు తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకోండి.

బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు తీసుకోవడం బెస్ట్‌ ఆప్షన్‌.

వీటిల్లో ప్రొడక్టివ్‌, ఆరోగ్యకరమైన రోజును అందించే అనేక లాభాలు ఉన్నాయి.

మార్నింగ్ ఎంత హడావిడిగా ఉన్నా.. తినడానికి గుడ్లు సిద్ధం చేసుకోవడం చాలా ఈజీ. 

కొన్ని సందర్భాల్లో బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకున్న గంటకే ఆకలిగా అనిపిస్తుంటుంది. 

అయితే గుడ్డు తింటే ఈ సమస్య ఉండదు. 

గుడ్డు తింటే ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీలింగ్‌ని అందిస్తుంది.

గుడ్డులో ఉండే కోలిన్ అనే పోషకం మెదడుకు రహస్య ఆయుధం లాంటిది.