JL Exams: జేఎల్ పరీక్షలు.. ఏ తేదీన ఏ పరీక్ష తెలుసుకోండి.. 

షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్‌ 12 నుంచి రాత పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

ఈ పరీక్షలు అక్టోబర్‌ 3 వరకు కొనసాగనున్నాయి. 

ఈ పరీక్షలు పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నారు.

మొత్తం 16 సబ్జెక్టులకు 11 రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు జరగనున్నాయి

కమిషన్‌ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు ప్రకటన వెలువడటం ఇదే తొలిసారి. 

సబ్జెక్టుల వారీగా పరీక్ష తేదీల విషయానికి వస్తే.. ఇంగ్లిష్‌ - సెప్టెంబర్ 12న నిర్వహించనున్నారు.  

వృక్షశాస్త్రం, ఆర్థికశాస్త్రం .. సెప్టెంబర్ 13న, గణితం - సెప్టెంబర్ 14న నిర్వహిస్తారు. 

రసాయనశాస్త్రం - సెప్టెంబర్ 20,  తెలుగు - సెప్టెంబర్ 21న ఉంటుంది. 

భౌతికశాస్త్రం, జంతుశాస్త్రం  - సెప్టెంబర్ 22న,  కామర్స్ - సెప్టెంబర్ 25న నిర్వహిస్తారు.