నెట్ రన్ రేట్ ఎలా లెక్కిస్తారు?

క్రికెట్ లో నెట్ రన్ రేట్ కు చాలా ప్రాధాన్యత ఉంది.

ద్వైపాక్షిక సిరీస్ ల్లో నెట్ రన్ రేట్ తో అవసరం లేకపోయినా.. టోర్నీల్లో మాత్రం దీనికి విశేష ప్రాధాన్యత ఉంటుంది.

ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో.. రెండు లేదా అంతకంటే ఎక్కువ జట్లు సమానమైన పాయింట్లను కలిగి ఉన్న సమయంలో నెట్ రన్ రేట్ ద్వారా ఏ జట్లు తర్వాతి రౌండ్ కు వెళ్తాయో నిర్ణయిస్తారు.

అయితే ఈ నెట్ రన్ రేట్ ను ఎలా లెక్కిస్తారో చాలా మందికి ఒక పజిల్ లా ఉంటుంది.

అయితే దీనిని చాలా సులభంగా అర్థం చేసుకుందాం.

ఒక టోర్నీలో ఒక జట్టు చేసిన మొత్తం పరుగులను.. అందుకోసం ఉపయోగించిన ఓవర్లతో భాగిస్తారు (A). అదే సమయంలో ప్రత్యర్థికి సమర్పించుకున్న పరుగులను అందుకోసం అవసరమైన ఓవర్లతో భాగిస్తారు (B).

ఇప్పుడు A-B చేస్తే నెట్ రన్ రేట్ వస్తుంది.

ఒక జట్టు 10 ఓవర్లకు ఆలౌటైనా.. నెట్ రన్ రేట్ ను లెక్కించేప్పుడు వన్డేలు అయితే 50 ఓవర్లకు.. టి20లు అయితే 20 ఓవర్లుగానే పరిగణిస్తారు.

ఒక టోర్నీలో ఒక జట్టు రెండు మ్యాచ్ ల్లో 40 ఓవర్లలో 260 పరుగులు చేసిందని అనుకుందాం.

ప్రత్యర్థులకు 40 ఓవర్లలో 236 పరుగులు సమర్పించుకుందనుకుందాం.

260/40-236/40... 6.5-5.9= 0.600గా నిర్ణయిస్తారు.