Jobs: తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ 

తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్(Notification) విడుదలైంది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీలో ఖాళీ పోస్టులకు నియామకం చేపట్టనున్నారు.

హైదరాబాద్ కేంద్రంగా ఉన్న న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌ 206 అప్రెంటిస్‌ ఖాళీలున్నాయి. 

ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

10వ తరగతితో పాటు ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.

సెప్టెంబర్‌ 30, 2023 దరఖాస్తులకు చివరితేదీగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 

నెలకు స్టైపెండ్ రూ.7,700 నుంచి రూ.8,050 వరకు ఉంటుంది.

ఎన్‌ఏపీఎస్‌ పోర్టర్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు ముగింపు తేదీ నాటికి 18 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదు.

ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌ ట్రేడులకు ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహించి ఎంపిక చేస్తారు.

పదోతరగతి/ ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా మిగిలిన ట్రేడ్స్ కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలకు https://nfc.gov.in/recruitment.html సందర్శించండి.