ర్యాకింగ్స్‌లో రఫ్ఫాడిస్తున్నాడు

ఆసియా కప్ 2023లో టీమిండియా చాంపియన్ గా నిలిచింది.

శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత్ 10 వికెట్ల తేడాతో నెగ్గింది.

మొహమ్మద్ సిరాజ్ 6 వికెట్లతో శ్రీలంకను కకావికలం చేసిన సంగతి తెలిసిందే.

కేవలం 16 బంతుల్లోనే 5 వికెట్లు తీసి చమిందా వాస్ రికార్డును సమం చేశాడు.

ఫైనల్ ప్రదర్శనతో వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్ లో సిరాజ్ దూసుకొచ్చాడు.

ఏకంగా 8 స్థానాలు ఎగబాకి టాప్ ప్లేస్ కు చేరుకున్నాడు.

ప్రస్తుతం వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్ లో సిరాజ్ నెంబర్ 1 బౌలర్ గా నిలిచాడు.

ప్రస్తుతం భారత్ వన్డే ప్రపంచకప్ కోసం రెడీ అవుతుంది.

అంతకంటే ముందు ఆస్ట్రేలియాతో 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆడనుంది.

తొలి వన్డే మొహాలీ వేదికగా 22న జరగనుంది.

అనంతరం 24న ఇండోర్ లో.. 27న రాజ్ కోట్ వేదికగా మిగిలిన వన్డేలు జరుగుతాయి.