ఈ 6 ఆహారాలూ ఆరోగ్యానికి మంచివే!

ఈ 6 ఆహారాలూ ఆరోగ్యానికి మంచివే!

కడుపు, పేగుల్లో ఆరోగ్య జాగ్రత్తలపై తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు తెలిశాయి.

6 రకాల ఆహారాలు ఆరోగ్యానికి మంచివేనని చైనాలోని దాలియన్ మెడికల్ యూనివర్శిటీ పరిశోధకులు తెలిపారు.

బీర్‌లోని బ్యాక్టీరియా చిన్న పేగులకు మేలు చేస్తుంది. బీర్ తాగితే గుండెకు మేలనీ, బరువు తగ్గుతారనీ, డయాబెటిస్, క్యాన్సర్ వంటి రోగాలు రావని పరిశోధకులు తెలిపారు.

బీర్‌లోని అమైనా యాసిడ్లు, మినరల్స్, డైటరీ ఫైబర్.. ఆరోగ్యానికి మంచివని పరిశోధకులు వివరించారు.

ఆవు పాలలోని అయోడిన్ థైరాయిడ్ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. 200ml పాలలో.. రోజుకు కావాల్సిన అయోడిన్‌లో 66 శాతం లభిస్తుంది.

పాలు తాగని వారికి అయోడిన్ లోపం ఏర్పడగలదు. థైరాయిడ్ లోపం వల్ల బరువు పెరుగుతారనీ, అలసటగా ఉంటారనీ, బ్రెయిన్ దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు.

మొక్కజొన్నలోని ఫైబర్ గుండెజబ్బులు, డయాబెటిస్, క్యాన్సర్లతో పోరాడుతుంది.

పాప్‌కార్న్‌లో విటమిన్లు, పోషకాలు, యాంటీఆక్సిడెంట్ ఫెనోలిక్ యాసిడ్లు ఆరోగ్యానికి మంచివని నిపుణులు తెలిపారు.

పామ్ ఆయిల్ వాడని, చక్కెర తక్కువగా ఉండే చాక్లెట్ తింటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

కోకోలో ఫ్లేవనాయిడ్స్ ఆరోగ్యానికి మంచివి కాబట్టి.. కోకో ఎక్కువగా ఉండే డార్క్ చాక్లెట్లు తినాలని చెబుతున్నారు.

బంగాళాదుంపల్ని తినేముందు చల్లగా చేసుకోవాలనీ, తద్వారా అవి త్వరగా పిండి పదార్థం (starch)గా మారవనీ, త్వరగా రక్తంలో కలవవని అంటున్నారు.

చల్లగా మార్చిన దుంపల్ని వేడి చేసినా, వాటి వల్ల షుగర్ లెవెల్స్ త్వరగా పెరగవు అని నిపుణులు చెబుతున్నారు.

ఇంట్లో స్వయంగా చేసుకునే పిజ్జా తినడం ఆరోగ్యకరం అంటున్నారు నిపుణులు.

పిజ్జా తయారీలో వాడే పిండిని ముందుగానే పుల్లగా అయ్యేలా చేసి తింటే, బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగవు అంటున్నారు.

Disclaimer: ఈ సమాచారం అందరికీ ఒకే రకంగా వర్తించకపోవచ్చు. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టీ ఫలితాలు ఉంటాయి. (All Images credit - Pexels.com)

ఇదీ చదవండి: నెలపాటూ ఉల్లిని వాడితే మీలో ఈ 10 మార్పులొస్తాయి