TS ICET: చివరి దశ కౌన్సెలింగ్ ప్రారంభం..
ఐసెట్ రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.
కౌన్సెలింగ్‌లో పాల్గొనదలచినవారు అవసరమైన అన్ని ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మొదటి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనలేకపోయినవారికి స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించారు.
అభ్యర్థులకు సెప్టెంబరు 23న ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు.
సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయినవారికి సెప్టెంబరు 22 నుంచి 24 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.
వీరికి సెప్టెంబరు 28న సీట్లను కేటాయిస్తారు.
సీట్లు పొందినవారు సెప్టెంబరు 28 నుంచి 30 లోపు నిర్ణీత ట్యూషన్ ఫీజు చెల్లించి.. కళాశాలకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
సెప్టెంబర్ 29న స్పాట్ ప్రవేశాలకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 26, 27 తేదీల్లో ఐసెట్ పరీక్ష నిర్వహించారు.
ప్రవేశపరీక్షలో మొత్తం 61,092 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
సెప్టెంబరు 6న ఐసెట్ తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకాగా.. సెప్టెంబరు 15న సీట్లను కేటాయించారు.
MG యూనివర్సిటీలో ఉద్యోగాలు..
వివరాలకు క్లిక్ చేయండి.
నిమ్స్ లో ఉద్యోగాలు
వివరాలకు క్లిక్ చేయండి.