టీమిండియా తీన్మార్

ఆసియా కప్ లో చాంపియన్ గా నిలిచిన టీమిండియా జోరు మీదుంది.

ప్రత్యర్థి ఎవరైనా విజయమే లక్ష్యంగా సాగిపోతుంది.

ఆసియా కప్ లో పాకిస్తాన్, శ్రీలంకలకు చుక్కలు చూపించింది.

తాజాగా ఆస్ట్రేలియాకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది.

తొలి వన్డేలో 5 వికెట్లతో విజయం సాధించింది.

ఫలితంగా అరుదైన ఘనతను అందుకుంది.

తొలి వన్డేలో నెగ్గి ర్యాంకింగ్స్ లో నెంబర్ 1కు చేరుకుంది.

ఇప్పటికే భారత్ టి20, టెస్టుల్లో నెంబర్ 1 గా ఉంది

తాజాగా వన్డేల్లో కూడా నెంబర్1గా నిలవడంతో అన్ని ఫార్మాట్లలో టాపర్ గా నిలిచిన రెండో జట్టుగా నిలిచింది.

2014లో సౌతాఫ్రికా మూడు ఫార్మాట్లలోనూ టాపర్ గా నిలిచింది.

ఇప్పుడు మళ్లీ భారత్ మూడు ఫార్మాట్లలోనూ నెంబర్1గా నిలిచింది.