నర్సరీతో లక్షలు సంపాదిస్తున్న బీహార్ యువకుడు

బీహార్‌లోని జముయికి చెందిన ఈ యువకుడు నర్సరీ ద్వారా లక్షలు సంపాదిస్తున్నాడు.

ప్రస్తుతం అతని దగ్గర 300 రకాల విదేశీ పుష్పాలు అందుబాటులో ఉన్నాయి.

జముయి జిల్లాలోని సింగర్‌పూర్‌లో ఈ యువకుడి నర్సరీ చాలా ప్రసిద్ధి చెందింది.

ఇక్కడి పూల మొక్కలు, జముయితో పాటు, మరో 5 జిల్లాలకు సరఫరా అవుతున్నాయి.

సింగర్‌పూర్‌లో నివసిస్తున్న కనిష్క్ కుమార్ కొన్నేళ్లుగా నర్సరీని నిర్వహిస్తున్నాడు.

స్వదేశీ, విదేశీ పూల మొక్కలతో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు.

ఈ నర్సరీ ద్వారా ఏటా రూ.5 నుంచి 7 లక్షల ఆదాయం వస్తుంది.

ఈ నర్సరీలోని పూల మొక్కలను భాగల్పూర్, లఖిసరాయ్ వంటి ప్రాంతాలకు కూడా పంపుతారు.

చిన్నగా మొదలైన ఈ వ్యాపారం ఇప్పుడు భారీగా విస్తరించింది.

ఇప్పుడు కనిష్క్ ఆ జిల్లాలోనే కాదు, రాష్ట్రం మొత్తానికీ తెలుసు.

పూల మొక్కలతో లక్షలు సంపాదించవచ్చని నిరూపిస్తూ, ఆదర్శంగా నిలుస్తున్నాడు.

ఇదీ చదవండి: ఈ 6 ఆహారాలూ ఆరోగ్యానికి మంచివే!