ఈ 10 బీచ్‌లు ఇండియాకి ప్రత్యేకం!

మీరు జీవితంలో మర్చిపోలేని వేకేషన్‌కి వెళ్లాలి అనుకుంటున్నారా? 

మీరు ఈ తెల్లటి, అందమైన బీచ్‌లను తప్పక సందర్శించాలి.

ఇక్కడ మీరు బీచ్‌తోపాటూ దట్టమైన అడవులు, అద్భుతమైన సూర్యాస్తమయాల్ని చూడగలరు.

ఇండియాలోని ఆ అద్భుత సముద్ర తీరాలేవో తెలుసుకుందాం.

హ్యావ్‌లాక్ దీవిలోని రాధానగర్ బీచ్.. ఆసియాలోనే గొప్పది. ఇది ప్రశాంతత, అద్భుత వీక్షణకు నిలయం.

Radhanagar Beach, Havelock Island

పేరుకి తగినట్లుగానే ఒడిశాలోని పూరీ బీచ్ బంగారు వర్ణంలో మెరుస్తుంది. ప్రియమైనవారితో సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని మర్చిపోలేం.

Puri Beach, Odisha

కేరళలోని వర్కల బీచ్.. మైమరచిపోయేలా చేస్తుంది. ఈ లొకేషన్ అద్భుతంగా ఉంటుంది. ఇదో రొమాంటిక్ గేట్‌వేగా ఫేమస్ అయ్యింది.

Varkala Beach, Kerela

కర్ణాటకలోని గోకర్ణ బీచ్ నీరు పారదర్శకంగా ఉంటాయి. స్విమ్మింగ్, సన్ బాతింగ్‌ చేయవచ్చు. సాహసాలు చేసేవారికి ఈ బీచ్ బాగా నచ్చేస్తుంది.

Gokarna Beach, Karnataka

గోవాలోని పాలోలెమ్ బీచ్ ఎటు చూసినా చూపుతిప్పుకోనివ్వదు. తీరంలో కొబ్బరి చెట్లు ప్రత్యేక ఆకర్షణతో మర్చిపోలేని అనుభూతి కలిగిస్తాయి.

Palolem Beach, Goa

పుదుచ్చేరిలోని ప్యారడైజ్ బీచ్ ప్రశాంతంగా ఉంటుంది. ఫొటోగ్రఫీకి పర్ఫెక్ట్ బీచ్. ఇక్కడి ప్రకృతి శబ్దాలు మనసును హత్తుకుంటాయి.

Paradise Beach, Puducherry

పుదుచ్చేరిలోని అగత్తి దీవి బీచ్ అందమైన తెల్లటి ఇసుక తిన్నెలకు ప్రసిద్ధి. ఇక్కడి కోరల్ గార్డెన్స్, స్థానిక సంస్కృతి కట్టిపడేస్తుంది.

Agatti Island Beach, Puducherry

మహారాష్ట్రలోని తర్కాలీ బీచ్‌ని చూడకపోతే ఏదో మిస్సైనట్లే. ఇక్కడ అద్భుతమైన పగడపు దిబ్బలున్నాయి. ఇక్కడి బ్లూ-గ్రీన్ నీరు మంత్రముగ్ధుల్ని చేస్తుంది.

Tarkali Beach, Maharashtra

కేరళలోని మరారీ బీచ్ కొబ్బరిచెట్లు, బ్యాక్ వాటర్ కెనాల్స్ కట్టిపడేస్తాయి. ఈ బీచ్ ప్రశాంతంగా, ఎక్కువ గాలి లేకుండా అందరికీ నచ్చుతుంది.

Marari Beach, Kerala

గుజరాత్ లోని శివరాజ్‌పూర్ బీచ్... ద్వారకాదీష్ ఆలయానికి 12కి.మీ దూరంలో ఉంది. ఈ తీరంలోని నీటిలో డాల్ఫిన్లు, రకరకాల పక్షుల్ని చూడవచ్చు.

Shivrajpur Beach, Gujarat