ఈ టీతో డయాబెటిస్‌కి చెక్..!

టీ అనగానే మనం పాలు, టీపొడితో చేసిన టీనే తాగుతూ ఉంటాం.

ఆరోగ్యంపై ఎక్కువ ఆసక్తి ఉన్న కొంతమంది గ్రీన్ టీ తాగుతారు. కానీ దీని రుచి అందరికీ నచ్చదు.

ఇప్పుడు మనం డయాబెటిస్‌ని కంట్రోల్ చేసే యాపిల్ టీ గురించి తెలుసుకుందాం.

యాపిల్స్ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతారు.

యాపిల్ టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి ఎప్పుడూ అదుపులో ఉంటుంది.

యాపిల్ టీలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ C, సోడియం అధికంగా ఉంటాయి.

యాపిల్ టీ బరువును తగ్గిస్తుంది. వ్యాయామం తర్వాత ఈ టీ తాగడం ఆరోగ్యకరమని నిపుణులు చెబుతున్నారు.

యాపిల్ టీ తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది.

యాపిల్స్‌లో ఫ్లేవనాయిడ్‌లు ఉంటాయి, ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎముకలు బలపడతాయి.

డాక్టర్ల ప్రకారం డయాబెటిస్ ఉన్నవారు యాపిల్స్ టీ తాగవచ్చు. యాపిల్స్ గ్లైసెమిక్ ఇండెక్స్ 38లోపే ఉంది.

యాపిల్ టీ తయారీలో దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు. యాపిల్ టీలో నిమ్మరసం కాడా కలుపుకోవచ్చు.

మార్కెట్‌లో రెడీమేడ్‌గా యాపిల్ టీ బ్యాగ్స్ లభిస్తున్నాయి. వాటితో ఈజీగా యాపిల్ టీ చేసుకోవచ్చు.