NHB Recruitment: నేషనల్ హౌసింగ్ బ్యాంక్ లో ఉద్యోగాలు..
NHB కాంట్రాక్టు/ రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీనిద్వారా మొత్తం 43 పోస్టులను భర్తీ చేయనున్నారు.
పోస్టును అనుసరించి సీఏ, డిగ్రీ, పీజీ ఉండాలి.
దీంతో పాటు.. పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
సరైన అర్హతలు గల అభ్యర్థులు అక్టోబర్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
విభాగాల వారీగా ఖాళీల్లో.. జనరల్ మేనేజర్(స్కేల్-7), డిప్యూటీ జనరల్ మేనేజర్(స్కేల్-4) ఉద్యోగాలున్నాయి.
వీటితో పాటు.. అసిస్టెంట్ జనరల్ మేనేజర్(స్కేల్-5), డిప్యూటీ మేనేజర్(స్కేల్-2) పోస్టులను భర్తీ చేయనున్నారు.
కాంట్రాక్టు పోస్టుల్లో.. చీఫ్ ఎకనామిస్ట్/ ఎస్‌ఏడీ/ ఏడీ/ ఎస్‌పీఎఫ్‌వో/ పీఎఫ్‌వో 19 పోస్టులున్నాయి.
పోస్టును అనుసరించి గరిష్ట వయోపరిమితి 30 నంచి 62 ఏళ్ల వరకు ఉంది.
దరఖాస్తు ఫీజు రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 చెల్లించాలి.
ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ టెస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
More
Stories
ఏడు లక్షల పార్ట్ టైమ్ జాబ్స్
ఐసీఎంఆర్ లో ఉద్యోగాలు
గురుకుల ఫలితాలు..