సౌత్ ఇండియన్ 10 బెస్ట్ బ్రేక్ ఫాస్ట్స్

ఇడ్లి.. ఇది సంప్రదాయ, ఆరోగ్యకరమైన అల్పాహారం. దీన్ని పులిసిన పిండిని ఉపయోగించి తయారు చేస్తారు. కొబ్బరి చట్నీ, సాంబార్ వేసుకుని తింటారు

దోశ.. మరో సంప్రదాయ రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ దోశ. ఇది అత్యంత జనాదరణ పొందిన అల్పాహారం. దీన్ని కూడా బియ్యం, మినుములు కలిపి పులిసిన పిండితో తయారు చేస్తారు. సాంబార్,  చట్నీ బెస్ట్ కాంబినేషన్

ఉప్మా.. ఉప్మారవ్వ లేదా వెర్మిసెల్లిని ఉపయోగించి తయారు చేస్తారు. దీంట్లో రకరకాల వెజిటేబుల్స్, మసాలాలు వేసి కూడా తయారు చేస్తారు

పుట్టు.. కేరళలలో అత్యంత జనాదరణ పొందిన అల్పాహారం. ఈ బ్రేక్ ఫాస్ట్ ను బియ్యం , పచ్చికొబ్బరి, బెల్లం, మసాలాలు వేసి ఆవిరిపై ఉడికించి తయారు చేస్తారు.

పొంగల్.. ఈ సాంప్రదాయ వంటకాన్ని అనేక పండుగలు, వేడుకల్లో కూడా తయారు చేసుకుంటారు. బియ్యం, పెసరపప్పు వేసి తాయరుచేస్తారు. ఈ వంటకాన్ని బ్రేక్ ఫాస్ట్ గా కూడా ఆరగిస్తారు.

ఊతప్పం.. ఇది కూడా దోశ పిండితోనే తయారు చేస్తారు. కానీ, దీన్ని కాస్త మందంగా ప్యాన్ కేక్ మాదిరి తయారు చేసుకుంటారు. వెజిటేబుల్స్ తో పైన గార్నిష్ చేస్తారు.

అప్పం.. బియ్యం పిండిని పులియబెట్టి, కొబ్బరిపాలు, తగినన్ని నీళ్లు పోసి తయారు చేసుకుంటారు.  అప్పాన్ని  కూరలతో కూడా తినవచ్చు.

పొంగనాలు.. దోశపండిని ఉపయోగించి తయారు చేస్తారు. దీన్ని ప్రత్యేకమైన పొంగనాల ప్యాన్ ఉంటుంది. దోశపిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము వేసుకుని తయారు చేస్తారు.

అక్కిరోటి.. ఇది కర్నాటక ప్రత్యేక వంటకం. బియ్యం పిండితో రొట్టెల మాదిరి చేసుకుంటారు. అత్యంత జనాదరణ పొందిన సౌత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్

నీర్ దోశ.. కేవలం దోశపిండి, నీటిని ఉపయోగించి తయారు చేస్తారు. దీనికి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం ఉండదు. చట్నీ, సాంబార్ నీర్ దోశకు బెస్ట్ కాంబినేషన్.

శివయ్యకు ప్రీతికరమైన ఈ ఆకు తింటే షుగర్, బీపీ నుంచి దూరంగా ఉండొచ్చు..