ఉసిరితో మీ స్కిన్.. మిల్కీబ్యూటీ తమన్నా స్కిన్ లాగా మెరుస్తుంది

ఉసిరి పండు శరీరంలోని ప్రతి భాగానికి ఉపయోగపడుతుంది.

తీపి, పులుపుల ఉసిరి, రుచితో ఆకట్టుకోవడమే కాకుండా, ఆరోగ్యాన్ని పెంచుతుంది.

కొంతమంది పుల్లగా ఉంటుందని ఉసిరి తినేందుకు ఇష్టపడరు, కానీ తింటే చాలా మేలు.

ఇందులో ఎక్కువగా ఉండే విటమిన్ సి, రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది.

ఉసిరి మన తల నుంచి, కాలి వరకూ చాలా వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతుంది.

రోజూ ఒక ఉసిరిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి ఎప్పటికీ బలహీనపడదు.

ఉసిరికాయలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అవి ముసలితనాన్ని దూరం చేస్తాయి.

ఫైబర్, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫాస్పరస్, ఐరన్, పిండి పదార్థాలు కూడా ఉసిరిలో ఉంటాయి.

పచ్చి ఉసిరికాయను ఖాళీ కడుపుతో తినడం వల్ల మీ కంటి చూపు, జుట్టు మెరుగవుతాయి.

మలబద్ధకం, విరేచనాల నుంచి కూడా ఉసిరి ఉపశమనం కలిగిస్తుంది.

అద్భుతమైన ప్రయోజనాల కారణంగా ఉసిరిని ఆయుర్వేదం, మందుల తయారీ, కాస్మెటిక్ ఉత్పత్తుల తయారీలో ఎక్కువగా వాడుతున్నారు.