బేబీ హెయిర్ ఆయిల్ ఇంట్లోనే తయారు చేసుకోండి!

పిల్లల చర్మం పెద్దల కంటే చాలా సున్నితంగా ఉంటుంది. పిల్లలకు వాడే నూనె ఉత్పత్తులలో రసాయన పదార్థాలు కలిపితే.. అది వారి చర్మం, జుట్టుపై ప్రభావం చూపుతుంది

ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల బేబీ కేర్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నప్పటికీ, అవన్నీ ఎంత మంచివో ఎవరికీ తెలియదు.(

ఎలాంటి కెమికల్స్ కలపకుండా ఇంట్లోనే బేబీ హెయిర్ ఆయిల్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం

ముందుగా అరకప్పు స్వచ్ఛమైన కొబ్బరి నూనె తీసుకోండి. తర్వాత కాస్త ఆముదం, పావు కప్పు స్వచ్ఛమైన ఆలివ్ ఆయిల్, రెండు చుక్కల లావెండర్ ఆయిల్ వేసి బాగా కలపాలి

ఇప్పుడు మీరు దీన్ని శిశువు శరీరంపై రాయవచ్చు

కావాలనుకుంటే ఇంట్లో తయారుచేసిన కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు

అలా కాకుండా మీరు వాడే నూనెలు స్వచ్ఛంగా లేకుంటే మీ బిడ్డకు చర్మ సమస్యలు వస్తాయి

కాబట్టి మంచి ఉత్పత్తులను ఉపయోగించండి. వాటిని ఉదయం మరియు సాయంత్రం కొద్దిగా వేడి చేసి శిశువుకు మసాజ్ చేయండి.

తయారుచేసిన నూనెను గాజు సీసాలో నిల్వ ఉంచి శుభ్రమైన ప్రదేశంలో ఉంచడం మంచిది.

నూనెను పూయడానికి ముందు బాటిల్‌ను ఎండలో ఉంచండి.

నిరాకరణ: ఈ కథనం నివేదికలు, ఇంటర్నెట్‌లో లభ్యమయ్యే సమాచారం ఆధారంగా రూపొందించబడింది. News18 దానితో అనుబంధించబడలేదు మరియు News18 దీనికి బాధ్యత వహించదు