స్టెవియాతో 10 ఆరోగ్య ప్రయోజనాలు
ఈ రోజుల్లో చాలా మంది పంచదార బదులు స్టెవియా పొడిని వాడుతున్నారు.
చక్కెర కంటే స్టెవియా దాదాపు 300 రెట్లు తియ్యగా ఉంటుంది. కొంచెం వాడినా సరిపోతుంది.
జీరో క్యాలరీలు: స్టెవియా క్యాలరీలు లేని స్వీటెనర్, క్యాలరీలు వద్దనుకునే వారికి ఇది గొప్ప ఎంపిక.
డయాబెటిక్-ఫ్రెండ్లీ: ఇది రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేయదు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు సురక్షితం.
సహజ మూలం: స్టెవియా కృత్రిమ స్వీటెనర్ల లాగా కాకుండా స్టెవియా మొక్క ఆకుల నుంచి తయారవుతుంది.
బరువు నిర్వహణ: ఇది చక్కెర వాడకాన్ని తగ్గించి, అధిక బరువు పెరగకుండా చేస్తుంది.
పిండి పదార్థాలు లేవు: స్టెవియాలో కార్బోహైడ్రేట్లు లేవు. ఇది ఎంతో ఆరోగ్యకరం.
నోటి ఆరోగ్యం: ఇది దంత క్షయాన్ని ప్రోత్సహించదు. దంతాలు పాడవ్వవు.
రక్తపోటు: కొన్ని అధ్యయనాల ప్రకారం రక్తపోటును తగ్గించడంలో స్టెవియా సహాయపడుతుంది.
యాంటీఆక్సిడెంట్ గుణాలు: స్టెవియాలో ఆరోగ్యాన్ని పెంచే యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి.
ఆరోగ్య నిపుణుల సలహాతో స్టెవియాని రోజూ ఎంత వాడాలో నిర్ణయించుకోవచ్చు.
More
Stories
పల్లీలను ఇలా వేపితే..
మీరు ల్యూసిడ్ డ్రీమరేనా?
వీటిని ఊరికే ఇవ్వకండి!