చాణక్య నీతి నుంచి 10 జీవిత పాఠాలు

ఎవరైనా మరీ ఎక్కువ నిజాయితీగా ఉండకూడదు. తిన్నగా ఉన్న చెట్లనే ముందు నరుకుతారు. అతి నిజాయితీ పరులకే ముందు నష్టం కలుగుతుంది.

ఇతరుల తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఆ తప్పులన్నీ మనమే చేసి, పాఠాలు నేర్చుకునేంత కాలం మనం జీవించం.

విద్య మనకు బెస్ట్ ఫ్రెండ్. చదువుకున్నవారికి అంతటా గౌరవం లభిస్తుంది. అందం, యవ్వనాన్ని చదువు జయిస్తుంది.

మీ రహస్యాల్ని ఇతరులకు చెప్పొద్దు. చెబితే, మీరు నష్టపోతారు.

పాము విషపూరితం కాకపోయినా, అది విషపూరితమైనదిగా నటించాలి.

భయం మిమ్మల్ని సమీపించినప్పుడు, దాడి చేసి నాశనం చేయండి.

పువ్వుల పరిమళం గాలి వీచే దిశలో మాత్రమే వ్యాపిస్తుంది, కానీ మనిషి మంచితనం అన్ని దిశలలో వ్యాపిస్తుంది.

మనిషి తన పనుల ద్వారా మాత్రమే గొప్పవాడు అవుతాడు, పుట్టుకతో దానికి సంబంధం లేదు.

ప్రతి స్నేహం వెనుక ఏదో ఒక స్వార్థం ఉంటుంది. స్వప్రయోజనం లేనిదే స్నేహం లేదు.

మీ హోదా కంటే ఎక్కువ లేదా దిగువన ఉన్న వాళ్లను స్నేహితులుగా ఎప్పుడూ చేసుకోకండి. అలాంటి స్నేహం ఎప్పుడూ ఆనందాన్ని ఇవ్వదు.