ఈ 10 మొక్కల
ఆరెంజ్ కలర్
పువ్వులు మెరుస్తాయి
ఏ ఇంటికైనా పువ్వులు అందాన్ని తెస్తాయి. పూల పరిమళాలు మనసును తేలిక చేస్తాయి. టెన్షన్లు తగ్గిస్తాయి. ఈ పూల మొక్కలు మీ గార్డెన్‌లో పెంచుకోవచ్చు.
Marigold:
బంతిపూలు ఆరెంజ్, పసుపు, ఎరుపు రంగుల్లో మెరుస్తాయి. ఈ మొక్కలు తేలిగ్గా పెరుగుతాయి. ఇంటికి ఎంతో అందాన్నిస్తాయి.
Daylily:
డేలిల్లీ పూలు కూడా మెరిసే అరెంజ్, ఇతర రంగుల్లో ఉంటాయి. ఈ పూలు బలంగా, ఆకర్షణీయంగా ఉంటాయి.
Zinnia:
జిన్నియా పూలు ప్రకాశవంతమైన అరెంజ్ సహా వివిధ రంగులలో వస్తాయి. కట్ ఫ్లవర్ ఎరేంజ్‌మెంట్స్‌కి ఇవి సరైనవి.
Lantana:
లాంటానా పువ్వులు గుంపులుగా, రంగురంగులతో ఉంటాయి. సీతాకోకచిలుకలను ఇవి ఆకర్షిస్తాయి.
Tithonia:
తితోనియాలను మెక్సికో సన్‌ఫ్లవర్‌గా చెబుతారు. ఈ పెద్ద మొక్కలకు అందమైన ఆరెంజ్ రంగుల పూలు పూస్తాయి.
Orange Canna Lily:
కాన్నా లిల్లీ పూలు ఆరెంజ్, ఎరుపు రంగులతో మెరుస్తాయి. ఎండల ప్రాంతాల్లో ఈ మొక్కలు బాగా పెరుగుతాయి.
California Poppy:
ఈ వైల్డ్ ఫ్లవర్స్ కాంతివంతమైన ఆరెంజ్, ఎల్లో రంగుల్లో పూస్తాయి. నీరు లేని గార్డెన్లకు ఇవి బాగా సెట్టవుతాయి.
Tangerine Dream Coneflower:
ఓ కోన్ ఫ్లవర్స్‌కి బ్రౌన్ కోన్ చుట్టూ ఆరెంజ్ కలర్ రేకలు ఉంటాయి.
Crocosmia:
క్రోకోస్మియా మొక్కల ప్రకాశవంతమైన ఆరెంజ్, గరాటు ఆకారపు పువ్వులు చూడచక్కగా ఉంటాయి.
Geum:
జియం పువ్వులను అవెన్స్ అని కూడా పిలుస్తారు. అందంగా నారింజ లేదా ఎరుపు రంగులో ఉండే ఈ పువ్వులు, రాక్ గార్డెన్‌లకు బాగా సరిపోతాయి.
More
Stories
ఇంటికి ఈ రంగులు వెయ్యకండి
వీటిని కూల్డ్రింక్తో శుభ్రం చెయ్యండి
ఉల్లితో 10 లాభాలు