1. మసాలా మ్యాగీ..
మ్యాగీతోపాటు మసాలా మిక్స్ కూడా ఉంటుంది. దీంతో మనం మసాలా మ్యాగీని తయారుచేసుకోవచ్చు..
2. ఎగ్ మ్యాగీ..
మ్యాగీలో గుడ్డు వేసి ఎగ్ మ్యాగీని తయారు చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఎల్లో యోక్ ను కూడా తీసేయండి. మ్యాగీ కుక్ చేసే సమయంలో చివర్లో ఒకటి లేదా రెండు గుడ్లు వేసి అవి ఉడికే వరకు కుక్ చేయండి
3. బ్రెడ్ మ్యాగీ..మ్యాగీ మీకు కావాల్సిన విధంగా వండిన తర్వాత టాస్ చేసిన బ్రెడ్ లేదా నేరుగా బ్రెడ్ మధ్యలో మ్యాగీని స్టఫ్ చేసి శాండ్విచ్ మాదిరి తినవచ్చు..
4. సూపీ మ్యాగీ..
ఇది సాయంత్రం సమయంలో ఆస్వాదించడానికి అద్బుతమైన రెసిపీ. ముందుగా వెజిటేబుల్ సూప్ తయారుచేసి అందులో మ్యాగీ వేసి కుక్ చేస్తే మ్యాగీ సూప్ రెడీ..
5. చికెన్ మ్యాగీ..వేయించిన లేదా లేయర్స్ గా కట్ చేసి కుక్ చేసిన చికెన్ ను మీ మ్యాగీ వంటకానికి జోడించి చూడండి. రుచి అదిరిపోతుంది
6. రొయ్యల మ్యాగీ..
మీకు సీఫుడ్ ఇష్టమైతే ఈ వెరైటీ వంటకం మీకు బాగా నచ్చుతుంది. ముందుగా రొయ్యలను ప్రత్యేకంగా వేయించాలి. ఆ తర్వాత మీ మ్యాగీ డిష్ కు యాడ్ చేస్తే సరిపోతుంది. ప్రాన్ మ్యాగీ రెడీ..
7. చీజ్ మ్యాగీ..
చీజ్ ను తురిమి వండిన మ్యాగీ పై వేసుకుని కాసేను మైక్రవేవ్ చేసుకుంటే చీజ్ మ్యాగీ హాట్ హాట్ గా బాగుంటుంది.
8. డీప్ ఫ్రైడ్..
మీరు మ్యాగీని క్రిస్పీగా తినాలనుకుంటే ఇలా వండుకోండి. దీనికి కడాయిలో వెజిటేబుల్ నూనెను డీప్ ఫ్రైకి సరిపడా తీసుకోవాలి. దీంట్లో మ్యాగీ వేసి డీప్ ఫ్రై చేయండి. రుచి కోసం కాస్త ఛాట్ మాసాలా కూడా వేస్తే రుచి మరింత బాగుంటుంది.
9. మ్యాగీ కబాబ్ రోల్..
వండిన మ్యాగీని రుమాలీ రోటీ, షీక్ కబాబ్, కేట్చాప్, కాండిమెంట్స్ వేసి చుట్టి రోల్ లాగా లాగించేయండి.
10. వెజిటేబుల్ మ్యాగీ..
ఇందులో మ్యాగీ మసాలా మాత్రమే కాకుండా.. మీకు ఇష్టమైన కూరగాయలను సన్నగా తరిగి వేసుకుంటే సరే .. ఈ మ్యాగీ ఆరోగ్యకరం కూడా అవుతుంది.