4 నిమిషాల కోసం రూ.3 కోట్లు...?

దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న తండేల్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. 

ఇప్పటికే రిలీజైన ఈ సినిమా పోస్టర్‌లు, గ్లింప్స్ ఆడియెన్స్‌లో ఓ రేంజ్‌లో అంచనాలు క్రియేట్ చేశాయి. 

ఈ సారి నాగ చైతన్యకు పాన్ ఇండియా రేంజ్‌లో హిట్టు పడేలానే ఉందని అక్కినేని ఫ్యాన్స్ అందరూ ధీమాగా ఉన్నారు. 

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తుంది.

అదేంటంటే.. ఈ సినిమాలో కేవలం ఒక్క పాటకే.. రూ.3 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారని ఇన్ సైడ్ టాక్. 

కథకు అనుగుణంగా వచ్చే ఓ స్పెషల్ సాంగ్‌ను ప్రస్తుతం మేకర్స్ చిత్రీకరిస్తున్నారట.

హైదరాబాద్ అవుట్ కట్స్‌లో ఓ భారీ సెట్ రూపొందించి అందులో ఈ పాటకు సంబంధించిన షూటింగ్ జరుగుతుంది.

శ్రీకాకుళం నేపథ్యంలో సాగే కథ కావడంతో అక్కడి జాతర్లలో..

రకరకాల వేషాలు వేసే పేరుమోసిన శ్రీకాకుళం కళాకారులు 65మందిని ఈ పాటకోసం మేకర్స్‌ రప్పించారట. 

బతుకు దెరువు కోసం సముద్రంపైకెళ్లి శత్రుదేశానికి బందీగా మారిన ఓ భర్త చేసే పోరాటం. 

భర్త కోసం మాతృదేశంలో ఆరాట పడే భార్య.. ఇలా ఓ విషాధభరిత ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కుతుందట.