డబుల్ ఎనర్జీ కోసం 4 సూపర్ ఫుడ్స్..

మనిషి మనుగడ సాగించాలంటే రోగనిరోధకశక్తి బలంగా ఉండాలి. 

అందుకు ఆహారం, పానీయాలు తీసుకోవడం సహజం. 

ఆహార పదార్థాలు, డ్రింక్స్ ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.  

ఉదయం పూట శరీరానికి ఇన్‌స్టంట్ ఎనర్జీ అందించే ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం.

దానిమ్మ.. ఉదయం సమయాల్లో ఈ పండు తింటే శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది.

బరువు తగ్గాలనుకునేవారు దానిమ్మ తినవచ్చు. ఇవి ప్యూరిఫయర్స్‌గా శరీరాన్ని శుభ్రపరుస్తాయి.

డ్రైఫూట్స్.. ఖర్జూరం, ఎండుద్రాక్ష, వాల్‌నట్స్, బాదం వంటి డ్రైఫ్రూట్స్‌ ఉదయం తింటే శరీరానికి శక్తి లభిస్తుంది. 

నిమ్మ.. ఉదయం పూట నిమ్మరసం తాగితే తక్షణ ఎనర్జీ శరీరానికి అందుతుంది.

నట్స్, సీడ్స్ అవిసెలు, చియా, గుమ్మడికాయ, పుచ్చకాయ విత్తనాలు, నువ్వులు తినడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది.

గమనిక.. ఇది సోషల్ సమాచారం మాత్రమే. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి.