పసుపులో కర్కుమిన్ ఉంటుంది, ఇది కాలేయానికి సహాయపడుతుంది. ఫైబ్రోసిస్, నాన్-ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్, క్రానిక్ లివర్ గాయాల నుంచి, సిర్రోసిస్ నుండి కాలేయాన్ని రక్షిస్తుంది, అంతేకాదు ఇది కాలేయాన్ని శుభ్రపరుస్తుంది.
ఈ అల్లంలో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి, ఇది శరీరం నుండి విషాన్ని, వ్యర్థాలను తొలగించడానికి బాధ్యత వహించే ఎంజైమ్‌లను ఉత్పత్తి చేయడానికి తోడ్పాటును ఇస్తుంది
మీ శరీరాన్ని శుభ్రపరచడానికి ప్రాసెస్ చేసిన ఆహారాల వినియోగాన్ని తగ్గించాలి. దీనికి బదులుగా, విటమిన్ బి, ఫాస్పరస్, మాంగనీస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు అధికంగా ఉండే తృణధాన్యాలను ఆహారంలో ఉంచుకోవాలి. బ్రౌన్ రైస్ వంటి తృణధాన్యాలలో సెలీనియం అధికంగా ఉంటుంది, ఇది కాలేయాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.
పండ్లు, పచ్చిగా లేదా జ్యూస్ చేసినవి, కాలేయానికి ఎంతో మేలు చేస్తాయి. సిట్రస్ పండ్లు కాలేయాన్ని ఉత్తేజపరచడమే కాకుండా హానికరమైన పదార్థాలను లివర్ నుంచి బయటకు పంపేలా చేస్తాయి.
బాదం, వేరుశెనగ, పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది. అధ్యయనాల ప్రకారం, విటమిన్ E ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇవి కూడా కాలేయాన్ని శుభ్రపరచడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.