మీ ఒంట్లో వేడిని తరిమికొట్టే ఐదు పండ్లు..

ఎండలు దంచికొడుతున్నాయి.

తీవ్రమైన వేడికి డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం..

శరీరంలో వేడి చేసే ప్రమాదం..

ఈ సమస్యలు రాకుండా సమ్మర్‌లో కొన్ని రకాల ప్రూట్స్ తినాలి. 

ఈ సీజన్‌లో అందరూ తినాల్సిన పండ్లు ఏవో చూద్దాం.

బొప్పాయి.. బొప్పాయిలో టమిన్ ఏ, విటమిన్ సి, ఫోలియేట్, ఫైటోకెమికల్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. 

జామ.. జామ పండ్లలోని పోషకాలు ఆరోగ్యానికి చాలా మంచివి. షుగర్ పేషెంట్లకు జామ సూపర్ ఫ్రూట్‌గా చెబుతారు. 

ఖర్బూజ.. ఈ పండులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది వేసవిలో శరీర ఉష్ణోగ్రత పెరగకుండా నిరోధిస్తుంది.

పుచ్చకాయ.. వేసవిలో వేడి తాపం నుంచి శరీరానికి ఉపశమనం కల్పిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

మామిడి.. మామిడి పండులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.

గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి.