మీ ఇంటికి దురదృష్టాన్ని తెచ్చే 5 మొక్కలు.. 

అలంకారానికి మొక్కలను పెంచుకోవడం మనకు తెలిసిందే..

చాలా మొక్కలు ఇంటికి మేలు చేసే వైద్య గుణాలను కలిగి ఉంటాయి..

అయితే కొన్ని మాత్రం చెడు శక్తిని ఆకర్షిస్తాయి.. అందులో ఒకటి చింత చెట్టు.. ఇది చెడు శక్తిని ఆకర్షిస్తుంది. అందువల్ల, వాటిని ఇంటి చుట్టూ లేదా ఇంటి లోపల నాటకూడదు. అవి ప్రతికూలతను ఆకర్షిస్తాయి, మానసిక ప్రశాంతతను భంగపరుస్తాయి.

బోన్సాయ్ మొక్కలు చాలా అందంగా ఉంటాయి కానీ వాటిని ఇంట్లో ఉంచుకోవడం మంచిందికాదు. ఈ మొక్కలను ఇంటి లోపల ఉంచడం వల్ల తమ వృత్తి, వ్యాపారాలలో సమస్యలను ఎదుర్కొంటారు.

కాక్టస్ ఆకులపై ఉన్న పదునైన ముళ్ళు ప్రతికూల శక్తిని కలిగి ఉంటాయని నమ్ముతారు కొందరు. కాక్టస్, ఇతర ముళ్ల మొక్కలు ఇంటిలో వాదనలను, అశాంతి పెంపొందిస్తాయని, శృంగార సంబంధాలకు హాని కలిగిస్తాయని కూడా నమ్ముతారు. వీరు ఆర్థిక ఇబ్బందులను కూడా కలిగి ఉంటారు.

ఇంట్లో అలంకరణ కోసం పత్తి మొక్కలను పెంచుతారు. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం, ఇది శుభప్రదంగా పరిగణించరు. వాటిని ఇంట్లో ఉంచుకుంటే ఇంటికి దుఃఖం, దురదృష్టం.

ఐవీ మొక్కలు కూడా విషపూరితమైనదిగా పరిగణిస్తారు కొందరు. ఇంట్లో పెంపుడు జంతువులకు కూడా ఇది మంచిది కాదు. ఐవీ చర్మానికి దురదను కలిగిస్తాయి. ఎవరైనా పొరపాటున తింటే అది చాలా హానికరం కూడా.