నెట్‌ఫ్లిక్స్‌లో ఈ 6 బ్లాక్‌బస్టర్స్‌ తప్పక చూడాల్సిందే.. 

లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ లియోలో తలపతి విజయ్ లియో, పార్థివన్‌గా ద్విపాత్రాభినయం చేశారు.

Leo

ఈ చిత్రం ఒక కేఫ్ యజమాని చుట్టూ తిరుగుతుంది, సంజయ్ దత్ మరో కీలక పాత్రలో కనిపించారు. లియో ప్రపంచవ్యాప్తంగా రూ. 600 కోట్లు వసూలు చేసింది.

ధనుష్ తెలుగులో అరంగేట్రం చేస్తూ వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన మరో మంచి మూవీ సర్.

Sir

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఆంధ్ర ప్రదేశ్‌లోని ఒక చిన్న పట్టణంలో బాల గంగాధర్ తిలక్ అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. రూ. 30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన సర్, ప్రేక్షకులకు ఆకట్టుకునే కథనంతో వావ్ అనిపిస్తుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 115 కోట్లను కొల్లగొట్టింది.

చిన్న సినిమాగా వచ్చిన కాంతార.. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టుకుంది. ఈ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. 

Kantara

పౌరాణిక అంశాలతో, థ్రిల్లింగ్ సన్నివేశాలతో అదరొట్టింది. ఈ సినిమా 400 కోట్లకు పైగా వసూలు చేసింది.

పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన జన గణ మన బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లు వసూలు చేసి వావ్ అనిపించింది.

Jana Gana Mana

మంచి కథాంశంతో వచ్చిన ఈ మలయాళీ సినిమా అదిరే సీన్స్‌తో కేక పెట్టిస్తుంది. 

SS రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, Jr NTR నటించిన RRR ఏకంగా ఆస్కార్ అవార్డును గెలుచుకుంది.

RRR

స్వాతంత్ర్యానికి ముందు భారతదేశం నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బ్రిటిష్ పాలనలో భారతీయుల పోరాటాలను చూపిస్తుంది. 500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి భారీ విజయాన్ని సాధించింది.

అహ్మద్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఇరైవన్ ఓ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో జయం రవి, నయనతార నటించారు.

Iraivan

ఈ చిత్రం కూడా థ్రిల్లింగ్ అంశాలతో అదరగొడుతుంది. జయం రవి ఈ సినిమాలో క్రూరమైన పోలీసు అధికారిగా కనిపిస్తాడు.